అంగరంగ వైభవంగా అశ్వత్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు.
జన చైతన్య న్యూస్: అంగరంగ వైభవంగా అశ్వత్థ నారాయణస్వామి బ్రహ్మోత్సవాలు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం సోముల దొడ్డి గ్రామ సమీపం లో వెలసిన అశ్వర్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులందరూ స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా భక్తులందరికీ ఇబ్బందులకు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించడం జరిగింది. అంతేకాకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు జరగకుండా పోలీసుల యంత్రాంగం పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు.